బాలయ్య, నాగ్ ఫ్యాన్స్ కోరిక అదే.. !

దశాబ్దాలుగా టాలీవుడ్ ని నలుగురు స్టార్ హీరోలు ఏలేస్తున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్. మహేష్, ఎన్టీఆర్, పవన్ స్టార్ హీరోలుగా ఎదిగే వరకు వీరిదే హవా. ఈ నలుగురు టాప్ స్టార్స్ లో నంబర్ వన్ గా ఉన్న చిరంజీవి పాలిటిక్స్ నుండి బయటికి వచ్చి మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్నారు. ఖైదీ 150, సైరా చిత్రాలు రికార్డ్స్ నెలకొల్పాయి. ఇక వెంకటేష్ కూడా మంచి సబ్జక్ట్స్ ఎంచుకుంటూ మంచి గ్రాఫ్ కొనసాగిస్తున్నాడు. గత ఏడాది ఆయన నటించిన మల్టీ స్టారర్ ఎఫ్ 2 సంక్రాంతి విన్నర్ గా సూపర్ హిట్ అందుకుంది.

ఇక నాగ చైతన్య తో చేసిన వెంకీ మామ సైతం హిట్ మూవీగా నిలిచింది. ఐతే బాలయ్య, నాగ్ మాత్రం వారి స్థాయి హిట్ అందుకోని చాలా కాలం అవుతుంది. గత ఏడాది బాలయ్య చేసిన మూడు సినిమాలు విఫలం కాగా, నాగ్ చేసిన మన్మధుడు 2 విమర్శల పాలైంది. దీనితో బాలయ్య, నాగ్ ఫ్యాన్స్ వారు 2020 లోనైనా తమ స్థాయి హిట్ కొట్టి ఫార్మ్ లోకి రావాలని ఆశిస్తున్నారు.

Exit mobile version