చరణ్ హీరోయిన్ కి శుభాకాంక్షలు చెప్పిన ఆర్ ఆర్ ఆర్ టీం

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు తన 27వ జన్మదినం జరుపుకోనున్నారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె ఆర్ ఆర్ ఆర్ లో సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ కి హీరోయిన్ గా ఆమె నటిస్తుంది. దీనితో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

400 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మరో హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

Exit mobile version