రాజకీయాల కోసం రెండేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుసగా మూడు చిత్రాలు ప్రకటించారు. వాటిలో వకీల్ సాబ్ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. ఇక ఆయన హరీష్ శంకర్ తో మరో మూవీ కమిట్ కావడం జరిగింది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఐతే పవన్ మరో చిత్రం కూడా ఒప్పుకోనున్నారని ప్రచారం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ తన 29వ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూవీలో పవన్ పాత్ర సీఎం అట. గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ పూరి పవన్ తో చేయాలని పావులు కడుపుతున్నాడని తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే వెండితెరపై సీఎం గా పవన్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోవడం ఖాయం.