సెన్సేషనల్ మూవీ కెజిఎఫ్ 2 నిర్మాతలు మూవీ విడుదల తేదీ ప్రకటించేశారు. కెజిఎఫ్ 2 మూవీ అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు వారు నిన్న అధికారిక పోస్టర్ విడుదల చేశారు. కన్నడ, తెలుగు, తమిళ్ మరియు హిందీ బాషలలో కెజిఎఫ్ 2 విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీపై అనేక పుకార్లు ప్రచారంలో ఉండగా నిర్మాతలు నిన్నటి ప్రకటనతో చెక్ పెట్టేశారు. ఐతే కెజిఎఫ్ 2 తో హీరో యష్ ఏకంగా సూపర్ స్టార్ రజిని కాంత్ తో పోటీపడనున్నాడు.
రజిని కాంత్ ప్రస్తుతం నటిస్తున్న అన్నాత్తే మూవీ కూడా అక్టోబర్ 23 విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కూడా తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. కాబట్టి యష్ కెజిఎఫ్ 2 మరియు అన్నాత్తే మధ్య తీవ్ర పోటీ నడిచే అవకాశం కనిపిస్తుంది.