మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. కాగా ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటించాల్సివుండగా నిన్న ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా త్రిషా చిరు సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పడం జరిగింది.
కాగా ఇప్పుడు త్రిషా స్థానంలో హీరోయిన్ గా చందమామ కాజల్ ని ఎంపిక చేశారట. త్వరలోనే ఆమె ఈ మూవీ సెట్స్ లో పాల్గొననున్నారట. అధికారిక ప్రకటన కూడా దీనిపై చిత్ర యూనిట్ చేయనున్నారని వస్తున్న సమాచారం. ఇక కాజల్ చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150లో నటించిన సంగతి తెలిసిందే.