తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జూన్ నుండి సెట్స్ పాకీ వెళ్లనుంది. గతంలో సూర్య, హరిల కాంబినేషన్లో ‘సింగం, ఆరు, వేల్’ లాంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సూర్యను ఎక్కువుగా పోలీస్, మాస్ కథల్లో చూపిన హరి ఈసారి ఫ్యామిలీ స్టోరీలో చూపించబోతున్నారు. సూర్య పూర్తి స్థాయి కుంటుంబ కథా చిత్రం చేసి చాల కాలం అయింది.
ఒకరకంగా వీరి గత చిత్రం ‘వేల్’ తరహాలో ఉంటుందట కొత్త చిత్రం. ఎప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్ నిర్ణయించారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సౌత్ తమిళనాడులోనే జరగనుందట. డి.ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇకపోతే సూర్య తాజా చిత్రం ‘సూరరై పొట్రు’ త్వరలోనే విడుదలకానుంది.