సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. కాగా ఈ సినిమా నుండి తాజాగా ‘‘ఏయ్ పిల్లా’’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. హీరో పాయింటాఫ్ వ్యూలో సాగే ఈ సాంగ్.. హీరోయిన్ గురించి హీరో ఫీల్ అవుతున్న ఎమోషన్స్ ను అండ్ ఫీలింగ్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పింగళి చైతన్య రాసిన సాహిత్యం సింపుల్ పదాలతో అర్ధవంతంగా సాగగా.. పవన్ సిహెచ్ చక్కని ట్యూన్ తో పాటను క్లాసిక్ టచ్ తో చక్కగా తీర్చిదిద్దారు. మొత్తానికి నెటిజన్లను సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ఇటీవల విడుదలైన ఈ సాంగ్ 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూకు మంచి ఆదరణ లభించింది. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని బలంగా ప్రజెంట్ చేయడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న ఈ ప్రేమలో తడిచేందుకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది ఈ సాంగ్. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. కాగా నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్కినేని అభిమనుల్లో, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.