కరోనా ఎఫెక్ట్.. షాక్‌లో స్టార్ హీరో ఫ్యాన్స్

స్టార్ హీరో విజయ్ ప్రతి సినిమాకు ఆడియో విడుదల ఈవెంట్ భారీగా చేస్తుంటారు. వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యే ఈ కార్యక్రమాల మీద విజయ్ సైతం ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఆయన కొత్త చిత్రం ‘మాస్టర్’ ఆడియో కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం జరగనుంది. ఎప్పటిలాగే దీన్ని కూడా భారీగా నిర్వహించాలని నిర్మాతలు అనుకున్నారు. ఫ్యాన్స్ సైతం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సన్నాహాలు మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు వేడుక అభిమానులు లేకుండానే జరుగుతుందని టాక్. ఇందుకు కరోనా ఎఫెక్ట్ కారణమని అంటున్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతమందిని ఒక చోటుకి చేర్చడం మంచిది కాదని భావించిన నిర్మాతలు అభిమానుకు లేకుండానే వేడుక చేయాలని అనుకుంటున్నారట. అయితే అభిమానుల కోసం ఈ వేడుకను సన్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందట. ఈ వార్తలతో ఖంగుతిన్న ఇలయదళపతి ఫ్యాన్స్ విజయ్, నిర్మాతల నుండి ఇది నిజమా.. కాదా అనే క్లారిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Exit mobile version