మహేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఆయన చాల మంది దర్శకుల నుండి కథలు వింటున్నారని టాక్ వినబడుతుంది. మరో వైపు వంశీ పైడిపల్లి తో ఆయన చేయాల్సిన మూవీ ఆగిపోలేదని, కొంచెం ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మహేష్ తదుపరి సినిమా విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. ఐతే మహేష్ నెక్స్ట్ మూవీపై మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
మహేష్ తో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మహేష్ కి భారీ ఆఫర్ ఇచ్చారట. తమ ప్రొడక్షన్ హౌస్ లో ఓ మూవీ చేయాలని వారు మహేష్ ని కోరారట. అలాగే మహేష్ కి దాదాపు 50కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన నవీన్ ఎర్నేని మహేష్ ని కలిసి ఈ ఆఫర్ ప్రకటించారని వస్తున్న సమాచారం. ఐతే ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.