నందమూరి బాలకృష్ణ నుండి కొత్త సినిమాకు సంభందించిన అప్డేట్ ఇంకా ఏదీ బయటకురాలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో మొదలుకావాల్సింది కొంత ఆలస్యంగా పొయిన వారమే పట్టాలెక్కింది. దీంతో ఫ్యాన్స్ రిలాక్స్ ఫీలయ్యారు. ఇక చిత్రంలో బాలయ్య రెండు పాత్రలు చేయనుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్రని అంటుండటం, ఆ పాత్ర కోసం బాలయ్య బాగా బరువు తగ్గి సన్నబడటంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది.
బాలయ్య గత సినిమాలు ఐదు నిరాశపరచడంతో ఈ సినిమా మీదే బోలెడు హోప్స్ పెట్టుకుని ఉన్నారు. రిలీజ్, టీజర్ డేట్స్ పక్కనబెడితే వీలైనంత త్వరగా.. అంటే ఈ ఉగాదికి ఫస్ట్ లుక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసి వదిలితే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి వారి కోరికను బోయపాటి అండ్ టీమ్ ఎంతవరకు ఆలకిస్తారో చూడాలి. ఇకపోతే మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి కథానాయకిగా ఫైనల్ కాగా ఇంకొక కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.