ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోయిన్ పేరు వినిపిస్తుందే..!

భారీ బడ్జెట్ తో పీరియాడిక్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ పై వస్తున్న ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ నుండి వస్తున్న లీకులు కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగేలా చేస్తున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి పులితో ఓ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ షర్ట్ లేకుండా బేర్ బాడీ తో ఉన్న ఓ ఫోటో లీకైంది. కాగా ఆర్ ఆర్ ఆర్ గురించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో ఓ హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తున్నారట.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవగణ్ ఓ పాత్ర చేస్తుండగా ఆ పాత్రకు జంటగా శ్రీయా శరణ్ ని తీసుకున్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం మొదలైన తాజా షెడ్యూల్ నందు ఆమె పాల్గొనడం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీయా శరణ్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక డివివి దానయ్య 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version