ఏటో వెళ్ళిపోయింది…కి డబ్బింగ్ చెబుతున్న నాని


చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాని హీరోగా, టాలీవుడ్ ఎంతగానో ఇష్టపడే అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నాని డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్లో జీవా హీరోగా నటించాడు.

Exit mobile version