తన అభిమానికి సినిమాని అంకితం ఇచ్చిన ప్రియ ఆనంద్

ప్రియా ఆనంద్ తన నెక్స్ట్ సినిమా ‘కో అంటే కోటి’ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలన్నీ కమర్షియల్ పరంగా పెద్దగ విజయాలు సాధించలేదు. కెరీర్ పరంగా ఆమెకు హెల్ప్ అయిన సినిమాలు కూడా లేవు. ఇటీవలే ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ఒక పాత్ర చేసిన ఆమె చాల రోజుల తరువాత ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె సత్య పాత్ర చేస్తుంది. ఈ రోజు చివరి రోజు షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె చాలా ఎమోషనల్ అయింది. ఇటీవలే ప్రమాదంలో చనిపోయిన తన అభిమాని సాహిత్యకి ఈ సినిమా అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అనీష్ కురివిల్ల దర్శకుడు. ఈ సినిమాని సర్వా ఆర్ట్స్ బ్యానర్ పై శర్వానంద్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version