డిపార్ట్ మెంట్ లో చేసిన తప్పు బూచి లో చెయ్యలేదంట


తనకు నచ్చిన విధంగా సినిమాలు తీసి వైవిధ్యమైన చిత్రాలు తీసే దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకి ఎటు పడితే అటు మరియు చూడటానికి అసౌకర్యమైన విధంగా కెమెరా యాంగిల్స్ పెడతాడనే చెడ్డ పేరు కూడా ఉంది. ఇటీవలే వచ్చిన ఆయన సినిమాల్లో ఇలాంటి కెమెరా యాంగిల్స్ చూడవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ తన రాబోయే సినిమా ‘బూచి’లో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారంట. ఇటీవలే హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ ‘బూచి’ సినిమాలో 90% కెమెరా స్టడీగానే ఉంటుందని’ వర్మ అన్నారు.

రామ్ గోపాల్ వర్మ చివరిగా నిర్మించిన ‘డిపార్ట్ మెంట్’ సినిమా తీయడంలో ఉపయోగించిన ‘ రోగ్ మేథడాలజీ’ మరియు కెమరా యాంగిల్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. 2003లో వచ్చిన ‘భూత్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘బూచి’ అనే టైటిల్ పెట్టారు.జె.డి చక్రవర్తి, మనీషా కోయిరాలా మరియు మధు శాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని 3డిలో విడుదల చేయనున్నారు. చాలా కాలం క్రితం విడుదలైన ‘భూత్’ మంచి విజయాన్ని అందుకుంది, దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘భూత్ రిటర్న్స్ 3డి’ కూడా విజయం సాదిస్తుందని వర్మ ఆశిస్తున్నారు.

Exit mobile version