అందంతో పాటు అభినయం కూడా కలిపి ఉన్న నటి దీక్ష సేథ్. ఇదే కాకుండా దీక్ష సేథ్ పుస్తకాల పురుగు అని కూడా తెలుస్తుంది ఖాళి సమయాల్లో ఆమె ఏదో ఒక పుస్తకం చదువుతూ గడుపుతుంది. తన ఇంట్లో ఒక మినీ లైబ్రరి ఉందని ఆమె చెబుతుంటారు. “నేను బాగా చదువుతుంటాను సినిమా సెట్స్ లో కూడా చదవటం నాకు అలవాటు “వేదం” చిత్రం సమయంలో ఒక చేతిలో స్క్రిప్ట్ పేపర్ మరో చేతిలో పుస్తకం పట్టుకొని కూర్చునేదానిని అది చూసి బన్ని “ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా?” అని టీజ్ చేసేవాడు.ఇప్పటికి అలానే అంటూ ఉంటాడు. నేను నా డిగ్రీ పూర్తి చెయ్యాలని అనుకున్నా కాని సినిమాల్లో అవకాశం రావడం వలన అది కుదరలేదు” అని దీక్ష అన్నారు. త్వరలో దీక్ష “రెబల్” చిత్రంతో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ప్రస్తుతం దీక్ష సేథ్ కి ఈ చిత్రం విజయం సాదించడం చాలా అవసరం.