ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రానికి టొరంటొలో స్టాండింగ్ ఓవియేషణ్


శ్రీదేవి తెర మీద కనిపించే రోజు దగ్గరవుతున్న కొద్దీ “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది. నిన్న ఈ చిత్రం ప్రఖ్యాత టొరంటొ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం చూసిన పలువురు ప్రముఖులు ఈ చిత్రం చూడగానే లేచి నిలబడి అభినందించారని ట్వీట్ చేశారు. ఈ స్పందన చూసిన శ్రీదేవి ఇలా ట్వీట్ చేశారు ” ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రానికి వచ్చిన స్పందన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది టొరంటొకి నా కృతజ్ఞతలు” అని అన్నారు. ఈ చిత్రానికి గౌరీ షిండే దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని సునీల్ లుల్ల, ఆర్ బల్కి, రాకేశ్ జుంజుంవాలా మరియు ఆర్ కే దమని కలసి నిర్మించారు. ఈ చిత్రంలో ఒక గృహిణి తన కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. ప్రియా ఆనంద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది హిందీ లో ఇదే తన తొలి చిత్రం. ఈ చిత్రంలో అజిత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి ఫైనల్ మిక్సింగ్ అందిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రం తెలుగు, తమిళ్ మరియు హిందీ లో అక్టోబర్ 5 న విడుదల కానుంది.

Exit mobile version