ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. నిన్న రాత్రి గాంధీ మెడికల్ కాలేజ్ లో నిర్వహించిన అవయవ దానం స్టాల్ కి రాజమౌళి గారిని అతిధిగా ఆహ్వానించారు అక్కడ పాల్గొన్న విద్యార్థులు మరియు వైద్యులతో మాట్లాడిన తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. “అక్కడ వైద్య విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు నేను అవయవాలను దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఇలా చెయ్యాలనుకునే వారు http://www.mohanfoundation.org విజిట్ చెయ్యండి. మన అవయవాలు 8 మందికి జీవితాన్ని ఇస్తుంది” అని అన్నారు. గతంలో అమల అక్కినేను, అరవింద్ కృష్ణ మరియు హర్షవర్ధన్ రాణే ఇదే ఫౌండషన్ కి అవయవాలు దానం చేసారు. లక్ష్మి మంచు, నవదీప్ మరియు నాగార్జున గతంలోనే ఈ ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి మంచి పనులకు మన తెలుగు తారలు చూపిస్తున్న ఆసక్తి చూపించడం సంతోషకరమయిన విషయం. భారతదేశంలో ప్రతి ఏడాది అవయవాలు దొరక్క వందలాది మంది చనిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు వారికి తోడుగా నిలబడటం వాళ్ళ పరిస్థితిలో మారు వచ్చే అవకాశాలున్నాయి.