కమల్ హసన్ ని స్పూర్తిగా తీసుకుంటున్న హాలీవుడ్.!


‘ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’, ‘కిల్ బిల్’ మరియు ‘పల్ప్ ఫిక్షన్’ లాంటి చిత్రాలను తీసిన ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టరంటినో మన సౌత్ ఇండియన్ హీరో కమల్ హాసన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకొని తన చిత్రంలో వాడుకున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. ఈ సన్నివేశాలకు హాలీవుడ్లో మంచి ప్రశంశలు వచ్చాయి. కమల్ హాసన్ నటించిన ‘అభయ్’ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను క్వెంటిన్ టరంటినో తను తీసిన ‘కిల్ బిల్’ చిత్రంలో ఉపయోగించారు మరియు ఆ చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది కానీ అప్పట్లో ‘అభయ్’ చిత్రం మాత్రం కేవలం ఒక విప్లవాత్మక సినిమాగా మాత్రమే నిలిచిపోయింది.

ఇటీవలే ఈ విషయం గురించి మన హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్, క్వెంటిన్ టరంటినోని అడిగినప్పుడు అది నిజమే అని ఆయన ద్రువీకరించాడు. ఇదే విషయాన్ని కమల్ ని అడిగితే తన సినమాని హాలీవుడ్ వారు ఉపయోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరియు క్వెంటిన్ టరంటినో సినమాల్లో సాంకేతిక విలువలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఆ విషయంలో ఆయన్ని మెచ్చుకోవాలన్నారు.

Exit mobile version