టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ఆగష్టు మొదటి వారం నుండి సమంత ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. గత రెండు నెలలుగా ఆంధ్ర ప్రదేశ్లో పలుచోట్ల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర చిత్రీకరణలో సమంత పాల్గొనలేదు. దానికి కారణం ఆమె అనారోగ్యానికి గురి కావడమే. ఆగష్టు మొదటి వారం నుండి చిత్రీకరణలో పాల్గొంటానని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుకి సమంత తెలియజేసింది. ప్రస్తుతం సమంత మళ్ళీ పని చెయ్యడానికి ఫీట్ గా ఉన్నారని, ఇకనుంచి విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొని తన సినిమాల్నిపూర్తి చెయ్యాలని అనుకుంటున్నారని సమాచారం.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ మరియు అంజలీలు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ.జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ కెమెరామెన్ కె.వి గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనోచేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.