తెరపైకి రానున్న మరో నాయిక జీవితం


ప్రస్తుతం ఒకప్పటి నటీనటుల జీవితాల్ని సినిమాలుగా తెఅరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ఒకప్పుడు పలు తెలుగులో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అందాల భామ దివ్యభారతి కథని తెరపై ఆవిష్కరించనున్నారు. సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో అనుమానాస్పదంగా దివ్యభారతి చనిపోయింది. తెలుగులో ‘రౌడీ అల్లుడు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ధర్మక్షేత్రం’ మరియు ‘బొబ్బిలి రాజా’ లాంటి పలు సూపర్ హాయ్ చిత్రాల్లో నటించారు. దివ్యభారతి చాలా యంగ్ ఏజ్ లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ప్రస్తుతం ఒక బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ దివ్యభారతి జీవితాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నాడు. కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాలో దివ్యభారతి పాత్ర కోసం కథానాయికను వెతుకుతున్నారు. ఈ యంగ్ దర్శకుడు ఎంతో కస్టపడి ఆమెకి సంభందించిన పలు విషయాలు సేకరించి ఈ చిత్రాన్ని తీయనున్నారు. సిల్క్ స్మిత జీవిత గాధతో తెరకెక్కిన ‘ద డర్టీ పిక్షర్’ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ పోషించారు, మరి ఈ చిత్రంలో ఎవరు కథానాయికగా చేయనున్నారు అనే దానికోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version