100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత చలన చిత్ర పరిశ్రమ

భారత చలన చిత్ర రంగం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ని ప్రారంభించనున్నారు. భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వారు రూపొందించిన ఈ వెబ్ సైట్ ను ఈ రోజు ఆవిష్కరించనున్నారు. ఈ వెబ్ సైట్ పేరు www.indiancinema100.com. ఇందులో భారతీయ చలన చిత్ర రంగం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? 1913లో తెరకెక్కిన భారతీయ తొలి చిత్రం “రాజా హరిశ్చంద్ర” ఎలా తెరకెక్కించారు? ఇలాంటి పలు రకాల విశేషాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. అలాగే సినిమా ఎన్నో గొప్ప గొప్ప సేవలందించిన ప్రతి ఒక్కరి వివరాలను మరియు అప్పటి ప్రముఖుల అరుదైన ఫోటోలను ఇందులో పొందుపరిచారు. అలాగే సినీ అభిమానులు తమ అభిప్రాయాలను మరియు సినిమాలకు సంభందించిన విశేషాలను కూడా ఈ వెబ్ సైట్ కి పంపే ఏర్పాటు చేశారు. aonfaimb@gmail.com అనే మెయిల్ ఐడికి మీ సమాచారాన్ని సంపాదించవచ్చు. మీరుపంపిన సమాచారాన్ని సినీ పరిశ్రమ మీద అనుభవం ఉన్న ఒక కమిటీ వారు పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.

Exit mobile version