తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆగుస్టులో పెద్ద సినిమాలతో కనువిందు చేయనున్నాయి. జూలైలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడటం వల్ల అన్ని సినిమాలు ఆగస్టు నెల పై కన్నేసాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ జూలై 13న విడుదల కావాల్సి ఉండగా ఆగష్టు 9 రాబోతుంది. విలక్షణ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు కూడా అదే దారిలో వెళ్లి ఆగష్టు 3న విడుదలకు సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం కూడా ఆగష్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రభాస్ నటిస్తున్న రెబల్, బాలయ్య ‘శ్రీమన్నారాయణ కూడా ఆగష్టులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలు సినిమా అభిమానుల్ని కనువిందు చేయడం మాత్రం ఖాయం.