ఓకే ఓకే ఆడియో విడుదల


ఉదయనిధి స్టాలిన్ మరియు హన్సిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం “ఓకే ఓకే” చిత్ర ఆడియో విడుదల ఈరోజు హైదరాబాద్ నోవాటెల్ లో జరిగింది. ఎం రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయం సాదించింది తెలుగులో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అనువదిస్తున్నారు. ఉధయనిది స్టాలిన్, హన్సిక, హారిస్ జయరాజ్, సిద్దార్థ్, సునీల్, నాగ చైతన్య, నందిని రెడ్డి, డాలీ, మారుతీ మరియు వి వి వినాయక్ ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది భారీ ఎత్తున విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version