పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ” కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం ప్రస్తుతం పద్మాలయా స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. పద్మాలయా స్టూడియోస్ ప్రాంగణంలో ఉన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ నేపధ్యంలో కొన్ని కీలకమైన ఆఫీసు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నారు మరియు కెమెరామెన్ గా తమన్నా కనిపించనుంది. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా కాలం క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ “బద్రి” చిత్రం తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ మరియు పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.