డూప్లికేట్ చిత్రంలో విడదీయలేని కవలల పాత్రలలో కనపడనున్న సూర్య


మాములు చిత్రాల నుండి విభిన్నమయిన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించిన దర్శకుడు కేవి ఆనంద్ గతంలో సూర్య స్మగ్లర్గా నటించిన “వీడోక్కడే” తరువాత జీవా హీరోగా “రంగం” చిత్రం తెరకెక్కించారు. తన కెరీర్లో మొదటి సారిగా కేవి ఆనంద్ “డూప్లికేట్” చిత్రంలో అవిభాజిక కవలల పాత్రలలో సూర్య కనపడనున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ కి “మాత్రాన్” అనే పేరుని ఖరారు చేశారు. ఈ చిత్రం చాలా భాగం చెన్నై, హైదరాబాద్ మరియు తూర్పు ఐరోపాలో పలు ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో సూర్యతో నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చిత్రీకరించారని సమాచారం. కాజల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర దశలో ఉంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.

Exit mobile version