టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా ట్విట్టర్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ అందాల భామ చార్మీ కూడా వచ్చి చేరింది. ట్విట్టర్లో తన ఐడి @charmmeofficial మరియు ఈ సందర్భంగా తనని ఫాలో అయ్యే తోటి నటీనటులు ఆమెకు ట్విట్టర్లో స్వాగతం పలికారు. ” ముందుగా నా స్నేహితుడు పూరి జగన్నాథ్ కి ధన్య వాదాలు, మొత్తానికి నేను ట్వి ట్ట ర్ లోకి వచ్చేశాను. ఇక్కడ ఎంతమంది నన్ను ప్రభావితం చేస్తారో చూద్దాం” అని చార్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చార్మీ ట్విట్టర్ లోకి వచ్చినందుకు తనకు వచ్చే అభినందనలు అన్నీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కే చెందాలి ఎందుకంటే చార్మీని ట్విట్టర్ లోకి రమ్మని చెప్పింది ఆయనే. అందుకే ఆమె పూరికి ధన్వాదాలు తెలిపారు.
ఈ మధ్య కాలంలో పెద్దగా గుర్తింపు లేని చార్మీ ఇప్పడు ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెళ్లి చార్మీకి ట్విట్టర్లో స్వాగతం చెప్పి, తన అభిప్రాయాలు మరియు ఇష్టా ఇష్టాలు తెలుసుకోండి.