విభిన్నత చాటుకున్న ‘గుండెల్లో గోదారి’ సెట్


మంచు లక్ష్మీ ప్రసన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా, అచ్చ తెలుగు వాతావరణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ” గుండెల్లో గోదారి”. ఈ చిత్రం ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రంలో చేపలు పట్టుకొని బతికే ఒక గ్రామం కోసం సుమారు 27 ఎకరాల్లో 120కి పైగా గుడిసెలు మరియు ఇళ్ళతో ఒక భారీ సెట్ ను వేశారు.

అయితే ఏంటి అంటారా…?
1986లో గోదావరిలో వచ్చిన వరదల నేతృత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకనే1980 కాలాన్ని తలపించేలా ఈ సెట్ ను వేశారు..
అలాగే … అందులో స్పెషల్ ఏముంది ?
స్పెషల్ ఉంది. కొండేటి మురళి ఈ భారీ సెట్ ను నిర్మించారు.
అతనిలో అంత స్పెషల్ ఏముంది..! మేము అతని పేరు కూడా ఎప్పుడూ వినలేదు అంటారా ?
సమాజం పట్ల ఎంతో భాద్యతాయుతంగా మరియు ఎంతో నీతి నిజాయితీలతో ఉండడమే అతనిలో ఉన్న ప్రత్యేకత. ఇలా ఎందుకంటున్నాం అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వేసిన ఈ సెట్ లో సమాజానికి హాని కలిగించే ఎలాంటి వస్తువులు వాడకుండా, పర్యావరణానికి అనుకూలమైన వస్తువులను ఈ సెట్ వేయడం కోసం ఉపయోగించారు.
ఇంత భారీ సెట్ కి పర్యావరణానికి ఇబ్బంది కలిగించని వస్తువులను వాడి ఈ సెట్ ను నిర్మిస్తానని కొండేటి మురళికి ఉన్న నమ్మకాన్ని చూసి ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు అతన్ని మెచ్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతో ఎంతో చక్కగా సెట్ ను రూపొందించారు.

ఆది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మీ మంచు మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సారి తెరకెక్కుతోంది.

ఈ చిత్రం యొక్క మరిన్ని విశేషాలు మరియు విడియోల కోసం – http://www.facebook.com/gundellogodari ని విసిట్ చేయండి.

Exit mobile version