సుదీప్ నన్నే మించిపోయాడు : రజనీ కాంత్


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగానే కాకుండా ప్రతినాయకుని పాత్రలు కూడా అద్భుతంగా చేస్తారు, ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి రజనీ కాంత్ ” ఈగ” సినిమా చూసిన తర్వాత రజనీ కాంత్ మాట్లాడుతూ ” ఇన్ని రోజులు విలన్ పాత్రలు చేయడంలో నేనే బెస్ట్ అనుకున్నాను కాని సుదీప్ నన్ను మించి చేశాడు” అని అన్నారు. వెంటనే సుదీప్ కు ఫోన్ చేసి ” ‘ఈగ’ చిత్రంలో విలన్ పాత్ర చాల అద్భుతంగా చేశారు. ప్రతినాయకుని పాత్ర చేయడంలో నన్నే మించిపోయావు, ఒకసారి మీరు చెన్నై వస్తే ఇద్దరం కలిసి సినిమా చూద్దాం” అని సుదీప్ ని చెన్నైకి ఆహ్వానించారు. అలాగే రజనీ ‘ఈగ’ చిత్ర దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేసి ” సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు, ఈ చిత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిరస్మరణీయ చిత్రంగా నిలిచిపోతుంది” అని రాజమౌళిని ప్రశంసించారు.

‘ఈగ’ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లోను ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీసు దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక హైలైట్.

Exit mobile version