టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” సార్ ఒస్తార “. ఈ చిత్రంలో అందాల భామ రిచా గంగోపాద్యాయ కథానాయికగా నటిస్తున్నారు. ” ‘సార్ ఒస్తార’ చిత్రంలో తను చేస్తున్న పాత్ర పేరు వసుధ అని, తను గతంలో ‘మిరపకాయ్’ మూవీలో చేసిన వినమ్ర మరియు ‘మయక్కం ఎన్నా’ అనే తమిళ మూవీలో చేసిన యామిని పాత్రలను కలిపితే ఎలాఉంటుందో అలా వసుధ పాత్ర ఉంటుందని” రిచా గంగోపాద్యాయ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజతో కలిసి రిచా రెండవ సారి నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఊటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరొక కథానాయికగా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.