నైజాంలో దూసుకుపోతున్న “ఈగ”


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరక్కించిన “ఈగ” చిత్రం నైజాంలో అత్యంత విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తాజా సమాచారం ప్రకారం నైజాంలో ఈ చిత్రం యొక్క మొదటివారం సుమారు 8 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. నైజాంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాదించిన టాప్ మూడు చిత్రాల రికార్డును బద్దలుకొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈగ చిత్రం టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి.

‘జులాయి’ మరియు ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల విడుదల వాయిదా పడడంతో ‘ఈగ’ చిత్రానికి ఎలాంటి పోటీ లేకుండా పోవడంతో, ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టే దిశగా పరుగులుతీస్తోంది.

Exit mobile version