కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసి డ్రామా చిత్రం ‘డమరుకం’ చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వి.ఎఫ్.ఎక్స్ పనుల ఆలస్యమవుతున్న విషయం మనకి తెల్సిందే. అగ్ర దర్శకుడు రాజమౌళి రెండేళ్ళ పాటు కష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ విషయంలో ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీ పడకపోవడంతో ఆలస్యంగా విడుదలైనా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ విషయంలో డమరుకం చిత్ర దర్శకుడు కూడా ఈగని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చిత్ర విడుదల ఆలస్యమైనా డమరుకం చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. నాగార్జునకి జంటగా అనుష్క నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.