రేపటి నుంచి యాక్షన్ చేయనున్న స్నేహ ఉల్లాల్


కామెడి కింగ్ ‘అల్లరి’నరేష్ హీరోగా నటిస్తున్న 3డి చిత్రం ‘యాక్షన్’. ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడుతూ ” అందాల భామ స్నేహ ఉల్లాల్ రేపటి నుంచి ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు అనిల్ సుంకర మీకు నిర్మాతగానే తెలుసు కానీ ఆయన అమెరికాలో 4 సంవత్సరాలపాటు దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు. ఆయన భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతారని ” ఆయన అన్నారు.ఇప్పటి వరకు 50% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. 3డిలో నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నతంగా రావాలని ఇంటర్నేషనల్ సాంకేతిక నిపుణుల చేత 3డి ఎఫ్ఫెక్ట్స్ చేయిస్తున్నారు.

ఈ కామెడి యాక్షన్ ఎంటర్టైనర్ లో అల్లరి నరేష్ తో పాటు ‘కిక్’ శ్యామ్, వైభవ్ మరియు రాజు సుందరంలు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని మరియు నీలమ్ ఉపాద్యాయ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జట్ చిత్రాన్ని ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి కొడుకు బప్పా లహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ నేపధ్య సంగీతం మరియు ఒక పాటను అందిస్తున్నారు.

Exit mobile version