ఫోటో మోమెంట్ : కోలీవుడ్ స్టార్లతో టాలీవుడ్ సూపర్ స్టార్


సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం ఒకటిగా కలిసే చోటే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక. నిన్న చెన్నైలో 59వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మహోత్సవం జరిగింది. సౌత్ ఇండియన్ సెలబ్రటీలు అందరూ వచ్చిన ఈ కార్యక్రమానికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా విచ్చేశారు. మీరు పైన చూస్తున్న ఫోటోలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు కోలీవుడ్ హీరోలు విక్రమ్, ధనుష్ మరియు అబ్బాస్ లు పక్కపక్కనే కూర్చొని ఉండగా ఫోటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్ మనిపించారు. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఈ చిత్రం మొత్తంగా 6 అవార్డులు గెలుచుకుంది. మహేష్ పక్కన చక్కగా పంచె కట్టుకొని ఉన్న ధనుష్ తమిళంలో ‘ఆడుకలం’ సినిమాకి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ‘దూకుడు’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ప్రిన్స్ మహేష్ బాబుకి 123తెలుగు.కామ్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

Exit mobile version