నానక్ రామ్ గూడలో చిత్రీకరణ జరుపుకుంటున్న “సుకుమారుడు”


ఆది,నిషా అగర్వాల్ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం “సుకుమారుడు” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు బృందం అంతా విజయనగరం వెళ్లనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరియు ఊర్వశి శారద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.” ” దర్శకుడి కోరిక మేరకు ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను ముప్పై ఏళ్ల క్రితం ఇదే బ్యానర్ లో “రౌడీ నెం1″ చిత్రాన్ని చేశాను వీరితో కలిసి మళ్ళీ పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది. ఆది చాలా బాగా నటిస్తున్నాడు అతనికి మంచి భవిష్యత్తు ఉంది” అని కృష్ణ అన్నారు. గతంలో “పిల్ల జమిందార్” చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ మీద వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నీలం ఉపాధ్యాయ, బ్రహ్మానందం మరియు తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version