బాద్షా కోసం హై ఎనర్జీ పాటలను రికార్డ్ చేస్తున్న తమన్

సంగీత దర్శకుడు తమన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న “బాద్షా” చిత్రం కోసం హై ఎనర్జీ పాటలను రికార్డ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా తమన్ తో ఈ దర్శకుడికి మంచి అవగాహన ఉంది. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్రంలో పాట పాడిన హరిణి రామ చంద్రన్ ఈ విషయాన్నే ట్విట్టర్ లో ప్రకటించారు. “ఒక హై ఎనర్జీ పాటను రికార్డ్ చేశాము చాలా మంది గాయకులతో మంచి వినోదంగా ఈ పాటను రికార్డ్ చేశాం. తమన్ అద్భుతమయిన పాటను రికార్డ్ చేస్తున్నారు” అని హరిణి అన్నారు. “బాద్షా” చిత్రీకరణ జూలై ఒకటి నుండి ఇటలీలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

Exit mobile version