తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని నడుపుతున్న అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గారు టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రం తీసిన విదానాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. సురేష్ బాబు సమర్పణలో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం యొక్క మొదటి కాఫీని చూసిన సురేష్ బాబు మరియు ప్రసాద్ వి. పొట్లూరి (తమిళ ‘నాన్ ఈ’ నిర్మాత) చిత్రం చాలా బాగా వచ్చిందని, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని రాజమౌళి గారే తెలిపారు.
‘ సురేష్ బాబు మరియు ప్రసాద్ వి. పొట్లూరి (తమిళ ‘నాన్ ఈ’ నిర్మాత) ఈ చిత్ర మొదటి కాఫీని చూసి చాలా బాగుందని, ఇలాంటి చిత్రంలో వారు కుడా ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారని’ రాజమౌళి గారు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.ఈ చిత్రం సెన్సార్ బోర్డు కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది, సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. భారీ అంచనాలున్న ఈ గ్రాఫికల్ మూవీ జూలై-06న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.