3 చిత్ర ఘోర పరాజయం ధనుష్ కెరీర్ ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టినట్టు కనిపించట్లేదు. ఈ నటుడు పలు చిత్రాలకు సంతకం చేశారు ఇందులో భరత్ బాల చిత్రం మరియు హింది “రాంజా” చిత్రం కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం “ఎదిర్ నీచల్” అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా తమిళ దర్శకులు నటులు మంచి చిత్రాలను నిర్మిస్తుంచడం ట్రెండ్ గా పాటిస్తున్నారు. “దర్శకులు శంకర్ మరియు మణిరత్నం ఇది పలు సంవత్సరాలుగా పాటిస్తున్నదే ప్రస్తుతం ధనుష్,విజయ్ మరియు ఆర్య వంటి నటులు చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. వెట్రిమారన్ సహాయకుడయిన సెంధిల్ “ఎదిర్ నీచల్” చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చివరగా 180 చిత్రంలో కనిపించిన ప్రియా ఆనంద్ శివ కార్తికేయన్ తో కలిసి ప్రధాన పాత్రలో కనిపించనుంది. మంచి ఆఫర్ కోసం గత కొన్నాళ్లుగా వేచి చూస్తున్న ప్రియా ఆనంద్ కి ఇది మంచి అవకాశము. ధనుష్ నిర్మిస్తున్న చిత్రం గనుక ఈ చిత్రం మీద అంచనాలు చాలానే ఉంటాయి ఈ అంచనాలను ప్రియా ఆనంద్ చేరుకోగాలదా? లేదా? అనేది చూడాలి.