అబ్బాయి షూటింగ్లో బాబాయ్

అదేనండి మేము మాట్లాడుతున్నది విక్టరీ వెంకటేష్ మరియు రానా గురించి. రానా దగ్గుబాటి రాబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ “కృష్ణం వందే జగద్గురు” చిత్ర చిత్రీకరణను ఈరోజు వెంకటేష్ వీక్షించారు. నానక్రాంగూడా లో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే నిర్మించిన సెట్ లో రాత్రి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర చిత్రీకరణకు అతిధులుగా వెంకటేష్ మాత్రమే కాకుండా హీరో నాని మరియు శర్వానంద్ కూడా విచ్చేసినట్టు రానా తెలిపారు. “కృష్ణం వందే జగద్గురు చిత్ర సెట్ ఈరోజు అతిధులతో నిండింది విక్టరీ వెంకటేష్ ,నని మరియు శర్వానంద్ ఈ చిత్ర సెట్ కి విచ్చేశారు” అని రానా ట్వీట్ చేశారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version