బుల్లి తెర నిర్మాణంలోకి గౌతం మీనన్

గౌతం మీనన్ నిర్మాణ సంస్థ “ఫోటాన్ కతాస్” ఇప్పుడు టీవీ రంగంలోకి ప్రవేశించనుంది. తాజా సమాచారం ప్రకారం ఫోటాన్ కతాస్ సంస్థ మహేష్ భూపతి కి సంభందించిన గ్లోబోస్పోర్ట్ తో కలిసి కొత్త రియాలిటి షో “సితార” చెయ్యనున్నారు ఈ షో రాబోయే దక్షణాది తార ఎంపిక గురించిన షోగా ఉంటుంది. ఈ షో తెలుగు,తమిళ,మలయాళం మరియు కన్నడలో ప్రసారం కానుంది. ప్రెస్ రిలీజ్ లో ఫోటాన్ కతాస్ CEO వెంకట్ సోమ సుందరం మాట్లాడుతూ ఇలా అన్నారు ” ఈ కార్యక్రమంతో మా నిర్మాణ సంస్థ పలు భాషల్లోకి ప్రవేశించనుంది దక్షణాది మొత్తం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది సరికొత్త పంథాలో కార్యక్రమాన్ని చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు. గతంలో ఫోటాన్ కతాస్ నుండి “నడునిశి నాయగల్”,”వెప్పం”,”అళగర్ సిమియిన్ కిదిరై” మరియు “తంగ మీంగల్” తో పాటు ప్రస్తుతం “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రానికి సహా నిర్మాణం అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం గౌతం మీనన్ పరిచయం చేసిన సామంత ప్రస్తుతం పరిశ్రమలో ర్పదాన తహరగా ఎదిగింది తరువాత నక్షత్రం కాబోయే అదృష్టవంతురాలు ఎవరు? వేచి చూడాల్సిందే.

Exit mobile version