విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు ‘ సుకుమార్ ‘ దర్శకత్వంలో ‘ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం సారధి స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. పోలిస్ స్టేషన్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ఈ రోజు మరియు రేపు తెరకెక్కించనున్నారు. మహేష్ బాబు మొదటిసారిగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు, ఈ చిత్రం లో మహేష్ బాబు ఇంతకు ముందు చేయని ఒక విభిన్న పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రం లో కథానాయిక. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.