చరణ్ జంజీర్ లో ఘాటైన రొమాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘జంజీర్’ చిత్రం లో ఘాటైన రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పెళ్లి కాకుండా సహజీవనం చేసే ఇద్దరు వ్యక్తులు గా రామ్ చరణ్ మరియు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రం లో మనకి కనపడతారు. మరి సహజీవనం చేసే వ్యక్తుల మధ్య ఉండే రొమాన్స్ ని కాస్త ఘాటుగా చిత్రీకరించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణం గా ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తారు అని తెలుస్తోంది.

అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మెహర నిర్మాత. ఇటివలే ఈ చిత్రం యొక్క తొలి షెడ్యూలు పూర్తి అయింది. హిందీ మరియు తెలుగు భాషలలో, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అంచనాలు భారీ గా ఉన్నాయి. మరి ఈ ఘాటైన రొమాన్స్ సీన్లతో ఇక ఈ అంచనాలు ఏ స్థాయి కి చేరుతాయో చూడాల్సిందే

Exit mobile version