బయలుదేరిన అధినాయకుడు యు ఎస్ ప్రింట్లు

నట సింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అధినాయకుడు” ఈ శుక్రవారం విడుదలకి సిద్దమయ్యింది. అమెరికా ప్రింట్లు ఈరోజు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరింది . ఈ ప్రింట్లు 30న పొద్దున్న 7AM(EST )కి అమెరికా చేరుకుంటాయి. షెడ్యూల్ పకారం అన్ని ప్రీమియర్ షో లు ప్రదర్శించబడతాయి. యు ఎస్ మార్కెట్ కోసం ఏడు బౌతిక ప్రింట్లు మరియు 18 డిజిటల్ ప్రింట్లు పంపారు. ఈ చిత్రంలో నందమూరి బాల కృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సలోని మరియు లక్ష్మి రాయి కథానాయికలుగా కనిపించనున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version