వరుణ్ సందేశ్ హీరోగా త్వరలో మన ముందుకు రాబోతున్న ‘చమ్మక్ చల్లో’ ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమా ద్వారా సంచిత పడుకొనే మరియు కేథరిన్ అనే హీరోయిన్లు పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత మాస్టర్ బుజ్జి బాబు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిఎస్ రావు సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి కిరణ్ వారణాసి సంగీతం అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, చిన్మయి, బ్రహ్మాజీ, షాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.