గుంటూరు మిర్చి యార్డ్లో రామ్ సినిమా


కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేసే ” బొమ్మరిల్లు భాస్కర్ ” దర్శకత్వంలో , ” ఎనర్జిటిక్ హీరో రామ్ ” హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం రామ్ కెరీర్ కి చాలా ముఖ్యమైనది మరియు రామ్ ఈ చిత్రం ద్వారా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మంచి సంభాషణలతో , అందమైన ప్రదేశాలలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్.ఈ సినిమా లో రామ్ కి జంటగా ‘ శుభ ఫుటేలా ‘ కథానాయికగా నటిస్తోందని చిత్రరంగం నుండి విశ్వసనీయ సమాచారం. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version