తనకంటూ ఒక ప్రత్యేక శైలి సృష్టించుకుంటానన్న “అమల పాల్ “


ప్రస్తుతం తెలుగు మరియు తమిళ చలన చిత్ర రంగంలో తన అందంతో , అబినయంతో ఆకట్టుకుంటున్న తార “అమలా పాల్”. చలనచిత్ర రంగంలో మన కథానాయికలు మాట్లాడే విదానమే వారికి చలనచిత్ర రంగం పట్ల ఉన్న గౌరవాన్ని , అర్హతల్ని తెలియజేస్తుంది. పత్రికా విలేకరులు అమలా పాల్ ని తన యొక్క స్టైల్ గురించి అడిగితే దానికి ఆమె ఇలా సమాదానం ఇచ్చారు ” తనదైన ప్రత్యెక శైలి తనకుందని , తను ఎవరి స్టైల్ ని అనుకరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరికైనా వారిలో ఉన్న ప్రత్యెక శైలి మాత్రమే అందరిలోనూ గుర్తింపు తీసుకొస్తుందని చెప్పారు . ప్రతి సంవత్సరం ఎంతో మంది కథానాయికలు వస్తుంటారు కానీ దానిలో కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుంటారు అలా గుర్తుండాలంటే ఎవరికి వారు వారి ప్రత్యేకతని కలిగిఉండాలని అన్నారు “. అమలా పాల్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు

Exit mobile version