కింగ్ నాగార్జున రాబోతున్న చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. దశరథ్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ చాయాగ్రాహకుడు అనిల్ బండారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాగార్జున సరసన నయనతార నటించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. పది సంవత్సరాల క్రితం వీరు ఇరువురి కలయికలో వచ్చిన “సంతోషం” భారీ విజయం సాదించింది. ప్రస్తుతం “షిరిడి సాయి” చిత్రాన్ని చేస్తున్న నాగార్జున ఈ చిత్రం తరువాత వీరభద్రమ్ దర్శకత్వంలో “భాయ్” చిత్రాన్ని చెయ్యనున్నారు.