శంకర్ – విక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారా?


తమిళ అగ్ర దర్శకుడు శంకర్ మరియు విక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నారు తమిళ ఇండస్ట్రీ వర్గాలు. శంకర్ డైరెక్షన్లో చివరి చిత్రం స్నేహితుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఈసారి తను చేయబోయే సినిమాకి పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుంటున్న శంకర్ తన తరువాతి సినిమాలో హీరో ఎవరని అడగగా ఇంకా ఎవరిని అనుకోలేదు అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. విక్రమ్, శంకర్ కలిసి గతంలో అపరిచితుడు వంటి సూపర్ హిట్ సినిమా చేసారు. వారి నుండి మరో సినిమా రావాలని కోరుకుందాం.

Exit mobile version