తేజ డైరెక్షన్లో వస్తున్న ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతుంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్న ఈ సినిమాకి రెడ్ కెమేరా వాడినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా HDRx అనే టెక్నాలజీ వాడినట్లు చెబుతున్నారు. అరకు వంటి వంటి అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయని సమాచారం. ప్రిన్స్ మరియు నందిత నటిస్తున్న ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించాడు.