రాజమౌళి “వన్ మాన్ ఆర్మీ” – నాని


“అలా మొదలయింది” భారీ విజయం సాదించడంతో నాని “ఈగ” మరియు “ఎటో వెళ్లిపోయింది మనసు” వంటి భారీ చిత్రాలు దక్కించుకున్నారు. ఈగ చిత్రంలో తన పాత్ర నిడివి తక్కువే అయినా రాజమౌళిని పొగడకుండా ఉండలేకపోయారు. ఈ ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ ” చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజమౌళిలో అద్బుతమయిన నటుడు ఉన్నారు. ఆయన చూపించిన దానిలో పది శాతం నేను చేసిన పాత్రకు న్యాయం చేసినవాడిని అవుతాను. ఆయన “వన్ మాన్ ఆర్మీ” ” అని చెప్పారు. “ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది” అని కూడా అన్నారు. ఈ చిత్రంలో సుదీప్,సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈగ ద్విభాషా చిత్రంగా రూపొందింది ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల చెయ్యనున్నారు. తమిళంలో ఈ చిత్రం పేరు “నాన్ ఈ”. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు.

Exit mobile version