తన రాబోతున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్రంలో పూరి జగన్నాథ్ బ్రెజీలియన్ సుందరి గబ్రియేల బెర్తంతేతో ఐటం సాంగ్ లో నృత్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ గతంలో ముమైత్ ఖాన్ మరియు శ్వేతా భరద్వాజ్ వంటి ఐటం గాళ్స్ ని పరిచయం చేశారు. వీరు చేసిన పాటల్లో చాలా వరకు విజయం సాదించినవే. రామ్ గోపాల్ వర్మ బ్రెజీలియన్ సుందరి నతాలియ కౌర్ ని ఎంపిక చేసుకోటం, ఇప్పుడు పూరి మరో బ్రెజీలియన్ అమ్మాయిను ఎంచుకోవటం ఆసక్తికర విషయం. రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ రవి నిర్మిస్తున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.